Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై కలెక్టర్,ఎస్పీలకు మంత్రి ఆదేశాలు
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల అక్రమాలపై ఎవర్ని ఉపేక్షించేది లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గతంలోనూ ఈ తరహా ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం సుమోటోగా తీసుకొని విచారణ జరిపించి అక్రమార్కులను కటకటాల వెనుకకు పంపిన విషయాన్నిగుర్తుచేశారు. ధాన్యం కొనుగోళ్లపై తాజాగా వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ మంత్రి కలెక్టర్ వినరు కష్ణారెడ్డి, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌లను ఆదేశించారు.దోషులని తేలితే ఏ ఒక్కర్ని వదిలిపెట్టమన్నారు.చర్యలు కఠినంగా ఉంటాయనిహెచ్చరించారు.