Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్
నవతెలంగాణ-భువనగిరి రూరల్
జిల్లావ్యాప్తంగా ఉన్న యువతకు స్థానిక పరిశ్రమలలో ఉపాధి లేక పరిశ్రమల యజమానులు ఉపాధి కల్పించే ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన వారిని తక్కువ వేతనాలతో పని చేయించుకుంటూ వెట్టి చేయించు కుంటున్నారని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధానకార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు.ఆదివారం అనాజిపురం గ్రామంలో డీివైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక పరిశ్రమలు ఏర్పడి స్థానిక యువతకు ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం ఇచ్చిన చట్టాలను పక్కదోవ పట్టిస్తూ, స్థానిక యువత పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శించారు.అప్పులు చేసి ఉన్నత చదువులు చదివినా చేతిలో పట్టుకొని అనేక మంది యువత హైదరాబాదు లాంటి మహానగరాలకు వలస వెళ్లి గుమస్తాలుగా షోరూంలలో ఇతర పనులు చేస్తూ కుటుంబాలు గడుపుతున్నాయన్నారు. ప్రభుత్వాలు మాత్రం నిరుద్యోగ భతి ఇవ్వడంలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడంలో మొండివైఖరితో ఉన్నాయన్నారు.జిల్లావ్యాప్తంగా ఉన్న అనేక పరిశ్రమల్లో స్థానిక యువతకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి ఎదునూరి వెంకటేష్,కోట ఉమేష్, అందె మణికుమార్, దొంత బాలకష్ణ, అందెశివకుమార్, సుర్పంగ మనోజ్, గంగదారి గణేష్, కుంచెం సాయి, బొల్లెపల్లిసాయికుమార్ పాల్గొన్నారు.