Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-చిలుకూరు
రాజ్యాంగం మార్చటం కాదు పాలకులను మార్చాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ దర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కొండాపురం గ్రామం లో మాజీ మండల కార్యదర్శి వెంకటేశ్వరరావు ఇంట్లో జరిగిన పరిచయ వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చడం అనేది సరికాదని, ఆయన మాట్లాడుతూ ఉంటే అర్థం పర్థం లేదు అన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నదని, వ్యవస్థ మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్తిందని, కేరళ రాష్ట్రంలో అన్ని తరగతులు అభివృద్ధి చెందుతూ ఉంటే తెలంగాణలో మాత్రం జరగడం లేదన్నారు. అభివృద్ధి జరుగుతున్నదని గొప్పలు చెప్పుకోవడం తప్ప తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏమీ లేదన్నారు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు కొనసాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కోట గోపి, నెమ్మది వెంకటేశ్వర్లు, వేనేపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.