Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
జిల్లాలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం కు వచ్చే భక్తుల కనుగుణంగా సౌకర్యాలను మెరుగు పరుస్తామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని చెరువుగట్టులో గల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్యయాదవ్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలతో కలిసి నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయం, గోశాల ప్రారంభం , నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపం విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భక్తుల విశ్వాసానికి ప్రతీకగా చెరువుగట్టు దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి నెలా అమావాస్యకు లక్షలాది మంది తరలి వస్తున్నారని, వారి అవసరాలను బట్టి కనీస సౌకర్యాలు అయినా మంచినీటి సౌకర్యం మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం దేవస్థానంపై బస చేసే విధంగా షెడ్ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అంతకంటే ముందు ఆలయ ఆచారం ప్రకారం అర్చకులు మంత్రికి కి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎంపీ బడుగు లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, ఆలయ పాలక మండలి చైర్మన్ మేకల అరుణ రాజిరెడ్డి, గ్రామ సర్పంచ్ మాల్గా బాలకృష్ణ, ఆలయ ఈవో కె.మహేంద్ర కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, దేవస్థాన డైరెక్టర్లు సిబ్బంది పాల్గొన్నారు.