Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
మునిపంపుల గ్రామ పరిధిలో రాచకాల్వ శిధిలావస్థలో ఉన్నాయని, అన్ని తూములను మరమతులు చేసి ప్రమాదంగా ఉన్న కాల్వ కట్టను బాగు చేయాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శివర్గ సభ్యులు యాదాసు యాదయ్య కోరారు.పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఇస్కిల్ల బ్రిడ్జి వద్ద శిధిలావస్థకు చేరిన తూమునిర్మాణపనులను వారు పరిశీలించి మాట్లాడారు.పునర్నిర్మాణం చేసే తూములకు పెద్ద పైపులు వేసి పకడ్బందీగా నిర్మించాలన్నారు.ఈ సారి 80 శాతం పొలాలు పెట్టనందున రాచకాల్వ మరమతులకు మంచి సమయమని, నీటి ప్రవాహం పెరిగే చోట మరమతులు చేయాలని కోరారు. మిగిలిన తుములన్నిటినీ బాగు చేయాలనీ వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి తొలుపునూరి శ్రీనివాస్, నాయకులు తాళ్ళపల్లి జితేందర్, జంపాల ఉమాపతి, తొలుపునూరి చంద్రశేఖర్, ఉండ్రాతి నర్సింహ్మ,నోముల రమేష్, గంటెపాక శివ కుమార్, మేడి బాషయ్య, మేడి ముకుందం, సంజీవ, నోముల నర్సిరెడ్డి, ఆకుల ఉపేందర్ తదితరుల పాల్గొన్నారు.