Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామన్నపేట: గ్రామపంచాయతీ కార్మికులపై మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, వేధింపులను ఆపాలని సీఐటీయూ సహాయ కార్యదర్శి మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.నకిరేకంటి రాము అధ్యక్షతన ఆదివారం మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామపంచాయతీ కార్మికులు ఏండ్లతరబడిగా తక్కువ వేతనాలతో గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న వేతనాలు పెంచడం లేదన్నారు. పంచాయతీలలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు, నర్సరీ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు,వాటర్ సప్లై కార్మికులు,వీధి దీపాల నిర్వహణ కార్మికులు, ఆఫీసు నిర్వహణ సిబ్బంది, కారోబార్, బిల్లు కలెక్టర్లకు కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.ఖాళీగా ఉన్న పోస్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేసి కారోబార్, బిల్ కలెక్టర్లను స్పెషల్ స్టేటస్ కల్పించాలన్నారు. పంచాయతీ అసిస్టెంట్ గా నామకరణ చేయాలన్నారు. 2011 జనాభా ప్రాతిపదికన కాకుండా 2021 జనాభా ప్రాతిపదికన కార్మికుల్ని పరిగణించాలను, ప్రస్తుతం పని చేస్తున్న వారందరికీ వేతనాలు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి బందెల బిక్షం, గాడే యేలయ్య, యాదయ్య, సాలయ్య, శంకర్, యాదమ్మ, రామచందర్, వసంత, అవనగంటి అంజయ్య పాల్గొన్నారు.