Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివ్వెంల:మండలపరిధిలోని ఉండ్రుగొండ గ్రామంలో నిర్మించనున్న ఎల్లమ్మ ఆలయాలకు భూమి పూజ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ ంలో ఉన్న పల్లేటి, కాంపాటి, చిలుముల వంశ స్తులకు సంబంధించిన పురాతన ఆలయాలను తొలగొంచి నూతన ఆలయాలు నిర్మించేందుకు చేపట్టిన భూమిపూజను సర్పంచ్ పల్లేటి శైలజ నాగయ్య ప్రారంభించారు. ఈకార్యక్రమంలో పల్లేటి, కాంపాటి, చిలుముల వంశస్తులు, పల్లేటి వెంకన్న కాంపాటి లక్ష్మయ్య, సైదులు, రాజు, రమేష్, నాగయ్య, సైదులు, వెంకన్న, కార్తీక్, అబ్రహం పాల్గొన్నారు.