Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి డిమాండ్ చేశారు.సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దళిత సాధికారత ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలు బాధ్యతలను జిల్లాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలకు అప్పగిస్తే రాజకీయ రంగు పులుముకొని అధికార పార్టీ కార్యకర్తలకు,అనర్హులకు ముందుగా అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ప్రజాప్రతినిధులకు పథకం అప్ బాధ్యతలు ఇస్తే దళితుల మధ్య చీలికలు వచ్చే ప్రమాద ముందన్నారు.ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర దళితబంధు పథకం అమలు నత్తనడకన కొనసాగే అవకాశాలు ఉంటాయన్నారు.ఇప్పటికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాల ఎంపికలో రాజకీయ జోక్యం కలిగి అనర్హులకు పథకాలు అందుతూ,అర్హులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకునేనాథుడే లేడన్నారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వర్రావు, జిల్లా నాయకులు కొండేటి ఉపేందర్, మోష, విక్రమ్, నరేష్ పాల్గొన్నారు.