Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లగొండ :భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ ముద్రించిన క్యాలెండర్‌ను ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని శ్రామిక భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, టీపీటీఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి పన్నాల గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలు కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని అన్నారు. కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చ డాన్ని కార్మిక లోకం తీవ్రంగా ఖండి స్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను, రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ మార్చి 27, 28న దేశవ్యాప్తంగా నిర్వహించే సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సార్వత్రిక సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు బీవీ చారి, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కుంచం వెంకన్న, కత్తుల చంద్రశేఖర్, జనపాటి శంకర్, చింతల వెంకటరమణ, దాసరి నరసింహ, చౌగిని స్వామి, గోవిందు అశోక్, రావుల వీరేశ్, సింగం రాము, షక్ పాషా, కట్టెకుంట్ల ముత్తు పాల్గొన్నారు.