Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుజూర్‌నగర్‌టౌన్:టీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పాలన సాగిస్తుందని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి విమర్శించారు.సోమవారం హుజూర్‌నగర్‌లో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈ విషయమై వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో వీఆర్ఏలకు ప్రకటించిన విధంగా సెప్టెంబర్ 9,2020 పేస్కేల్ జీఓను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేశారు.వీఆర్ఏలు గౌరవంగా బతకడానికి పేస్కేల్ ఇస్తామని, 50 ఏండ్లు దాటిన వారసులకు ఉద్యోగాలిస్తామని శాసనసభలో ప్రకటించి 18నెలలు దాటినా అమలు చేయలేదన్నారు.కనీసం పీఆర్సీలో చేర్చుతామని చెప్పి మరీ మోసం చేసిందన్నారు.కోవిడ్‌తో మృతి చెందిన వీఆర్ఏలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు.వీఆర్ఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీమల్ల నర్సింహారావు మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలు పరిష్కరించా లని ఈనెల10న కలెక్టర్ కార్యాలయం వద్ద,ఈనెల 22నన చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నాకు పెద్దఎత్తున తరలించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్, నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు చిన్నవీరయ్య, ఎండి.ఖాశీం,వీరబాబు,నాగమ్మ, సంధ్య, సుశీల్,రంజాన్, అన్నపూర్ణ పాల్గొన్నారు.