Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులుములకలపల్లి రాములు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధిహామీచట్టంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం మెమోరాండం సమర్పించారు.ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నిత్యం కూలీలకు అందుబాటులో ఉంటూ కేవలం ఉపాధిహామీ పనులే కాకుండా ప్రభుత్వం చేపట్టిన హరితహారం,మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతల నిర్మాణం, డంపింగ్ యార్డు నిర్మాణాలపై, పల్లెప్రకతి వంటి ప్రభుత్వ కార్యక్రమాలలో పని చేస్తున్న వారిని ప్రభుత్వం తొలగించడం అన్యాయ మన్నారు.గ్రామస్థాయిలో కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించాలన్న వేతనాలు సక్రమంగా అమలు జరగాలన్న ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకమన్నారు.ప్రభుత్వం ఒక్క కలంపోటుతో జీఓలు 47, 79 తెచ్చి ఫీల్డ్అసిస్టెంట్లను బజారుకు ఈడ్చిందన్నారు. వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ విధుల్లోకి తీసుకోకపోవడం సరికాదన్నారు.మనస్తాపానికి గురై ఇప్పటివరకు 64 మంది ఫీల్ట్అసిస్టెంట్లు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షులు మేడి యాదయ్య, కార్యదర్శి బూడిద లింగయ్య, ఫీల్డ్అసిస్టెంట్లు ధీరావత్ శ్రీనివాస్ ఎం.వీరస్వామి, కె.వీరయ్య, ఎస్.శ్రీనివాస్, ఎం.శరభయ్య, ఎం.భిక్షం, బి.జగన్, బి.శ్రీనివాస్‌నాయక్ పాల్గొన్నారు.