Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సూర్యాపేట ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-కోదాడరూరల్
గంజాయి, డ్రగ్స్,ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రజలంతా సామాజికబాధ్యతగా తీసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.సోమవారం పట్టణంలోని గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్హాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం నిర్వహించిన అవగాహనా సదస్సును ద్దేశించి ఆయన మాట్లాడారు.సీఎం కేసీఆర్ ఆదే శాలకు అనుగుణంగా గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాలకు వ్యతి రేకంగా జిల్లావ్యాప్తంగా పలు అవగాహనా కార్యక్రమాలు నిర్వ హిస్తున్నామన్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. మత్తుపదార్థాలతో యువత పెడదారి పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంతో పోల్చుకుంటే డ్రగ్స్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరగడం ఆందోళనకరంగా ఉందన్నారు.ముఖ్యంగా కళాశాలల్లో విద్యాసంస్థల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఎక్సైజ్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ డ్రగ్స్ రూపంలో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రతిఒక్కరూ వీటిని దూరం చేసేదిశగా తమ శాఖ పని చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు, పట్టణ సీఐ నర్సింహారావు,రూరల్ సీఐ ప్రసాద్, ఎక్సైజ్ సీఐ రాజ్యలక్ష్మి, మునగాల సీఐఆంజనేయులు, మున్సిపల్ చైర్మెణ్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, ఎంపీపీ చింతా కవితరాధారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ కల్లూరి పద్మజ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు పాల్గొన్నారు.