Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి
నవతెలంగాణ-హాలియా
మత్తుపదార్థాలను నిషేధించడంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలిసిన బెల్టు షాపులను రద్దు చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. సోమవారం అనుముల మండల కేంద్రంలో ఐద్వా సభ్యత్వ చేర్పింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ఆదాయమే పరమావధిగా చూస్తుందని, ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతలు, మహిళల భద్రత గాలికి వదిలేసిందని అన్నారు. విచ్చలవిడిగా మద్యం దొరకడం వలన మహిళలపై అనేక అఘా యిత్యాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం కొరకు నిధులు కేటాయించడం లేదని, మహిళలు సమభావన సంఘాల ద్వారా పొదుపు చేసుకొని బ్యాంకులకు వడ్డీలు కడుతున్నారని, నేటికీ పావలావడ్డీ ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. మహిళలు స్వయం పోషకంగా నిలబడాలంటే గ్రామీణ వృత్తులను ప్రోత్సహించాలని అన్నారు. వాటికి ప్రభుత్వం నగదు సబ్సిడీ ద్వారా అందించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఐద్వాలో మహిళలు సభ్యులుగా చేరుతున్నారని అన్నారు. సభ్యులుగా చేరి సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు దైదా జానకమ్మ, జిల్లా సహాయ కార్యదర్శి కారంపూడి ధనలక్ష్మి, నాయకులు సుజాత, మంజుల, సభావత్ కవిత, తిరుపతమ్మ, సభావత్ కవితా గోపమ్మ, తిరుపతమ్మ, నాగమణి, రాజేశ్వరి, మంజుల పాల్గొన్నారు.