Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సూర్యాపేట జిల్లా ఉద్యానవన పట్టుపరిశ్రమ అధికారి శ్రీధర్
నవతెలంగాణ-గరిడేపల్లి
మల్బరీ సాగు చేపట్టి పట్టు పురుగుల పెంపకం చేపట్టడం ద్వారా రైతులు నెలనెలా ఆదాయం పొందొచ్చని సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమ అధికారి బి.శ్రీధర్ అన్నారు.కేవీకే గడ్డిపల్లిలో సోమవారం ఏర్పాటు చేసిన మూడు రోజుల పట్టు పరిశ్రమలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.పట్టుపరిశ్రమ ప్రాముఖ్యత గురించి వివరిం చారు.ఈ శిక్షణ కార్యక్రమాన్ని కేంద్రీయ పట్టుపరిశోధనాకేంద్రం రీజినల్ రీసెర్చ్‌సెంటర్ ములుగు వారి ఆర్ధిక సహకారంతో నిర్వహి స్తున్నట్టు, తెలం గాణలోని 14 జిల్లాల నుండి యువరైతులు ఈ శిక్షణకు హాజరవు తున్నట్టు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్, హెడ్ బి.లవ కుమార్ తెలిపారు.కేవీకే నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, పట్టు పరిశ్రమ స్థాపన ద్వారా ఉపాధిఅవకాశాల గురించి వివరించారు.అనంతరం కేవీకే సెక్రెటరీ డా జి.సత్యనారాయణరెడ్డి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి మల్బరీ ఎంతో అనుకూలంగా ఉంటుందన్నారు.అధిక ఆదాయం పొందొచ్చన్నారు. దేశంలో పట్టుఉత్పత్తి 36 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అయితే డిమాండ్ 60 వేల టన్నులు ఉన్నదని ప్రాంతీయ పట్టు పరిశోదనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్,హెడ్ డా.ప్రవీణ్‌కుమార్ అన్నారు.పట్టు ఉత్పత్తి మార్కెటింగ్ అంశాలపై జిల్లాలోని ఎంపిక చేసిన రైతులకు కేవీకే ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.పట్టుపరిశ్రమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వీరకుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పట్టు రైతులకు ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ద్వారా తగు సహకారం అందిస్తున్నామని,సబ్సిడీల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో కేవీకే పట్టుపరిశ్రమ విభాగం శాస్త్రవేత్త మాధురి పట్టుసాగులో చేపట్టాల్సిన మెళకువల గురించి వివరించారు.ప్రాంతీయ పట్టు పరిశ్రమ సీనియర్ శాస్త్రవేత్త వినోద్‌కుమార్, కేవీకే శాస్త్రవేత్తలు కిరణ్, ఆదర్శ్, నరేష్లతో పాటు తెలంగాణలోని 14 జిల్లాలకు చెందిన 40 మంది యువరైతులు పాల్గొన్నారు.