Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్‌హాషం
నవతెలంగాణ-నల్లగొండ
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని నిరవధిక సమ్మె చేస్తున్న పవర్లూమ్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం, 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న పేర్కొన్నారు. పద్మానగర్‌లో సోమవారం కార్మికుల 6వ రోజు రిలే నిరాహార దీక్షలకు హాజరై వారు మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చి న్యాయపరంగా సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల యజమానులు మొండి వైఖరితో ఉండడం సరికాదన్నారు. ప్రభుత్వ పథకాలు సబ్సిడీలు పొందుతున్న యాజమాన్యాలు కార్మికుల సంక్షేమం పట్టించుకోరా అని వారు ప్రశ్నించారు. కరోనా నేపథ్యంలో కార్మికుల బాధలను అర్థం చేసుకొని తక్షణమే కూలి రేట్లు పెంచి సమ్మె విరమింప చేయాలని యజమానులకు వారు విజ్ఞప్తి చేశారు. లేనియెడల కార్మికులు చేసే పోరాటాలకు తాము అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు గంజి నాగరాజు, ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పద్మా నగర్ ఏరియా అధ్యక్షులు బొగు సత్యనారాయణ, పసునూరు యోగానందం, రామకోటి, భిక్షపతి, భద్రయ్య, చంద్రయ్య, షేక్ జానీ, అంజయ్య, వెంకటేశం పాల్గొన్నారు.