Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్
నవతెలంగాణ-ఆలేరుటౌన్
:కల్లుగీత కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజు గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లా డారు. యాదగిరి గుట్ట మండలం మహబూబ్ పేట గ్రామ గీత కార్మికుడుతో పాటు, ఇటీవల 20మంది వరకు గీతా కార్మికులు తాటి చెట్టు పైనుండిపడగ కొందరు మత్యువాత పడగా ,మరికొం దరు తీవ్ర గాయాల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు . కార్మికులను ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే వాడుకుంటుందన్నారు. కల్లు గీత ఆర్థిక కార్పో రేషన్ ద్వారా మరణించిన గీత కార్మి కుని అంత్యక్రియలకు రూ.25 వేల సహాయం అందించాలని , వారి పిల్లలకు విద్య ,వైద్యం ఉద్యోగం కల్పించాలని కోరారు. బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రావెంకటేశం కి, కార్పొరేషన్ ఎండీ ప్రకాష్ కి , ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ కి ప్రభుత్వానికి ఇటీవల వినతులు అందజేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ ,దపటి వెంకటేష్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.