Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య
నవతెలంగాణ- రామన్నపేట
కాంగ్రెస్ పార్టీకి రానున్నవి అన్ని మంచి రోజులేనని, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని టీపీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య అన్నారు. మండలంలోనీ నిదానపల్లి గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు మల్లన్న గుట్ట పైన భ్రమరాంబ మల్లికార్జున స్వామి (చిన్న శ్రీశైలం) ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయన మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముందుందన్నారు. నిత్యం భక్తులు వచ్చే ఈ ఆలయాన్ని ప్రభుత్వం పట్టించుకోని మౌలిక సౌకర్యాలు, వసతి గహాలు, ఏర్పాటు చేస్తే, అభివద్ధి చెందుతుందని తెలిపారు. ఆనంతరం మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ హైమద్ ఇటీవల గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబానికి రూ.5 వేలు, పెరాలసిస్ తో బాధపడుతున్న గోదాసు ఆదినారాయణకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సాల్వే రు అశోక్, ఎండి.జమిరుడ్డిన్, కొండ వెంకటేశం, మందడి సంతోష్ రెడ్డి, కొండ శేఖర్ గౌడ్, బొడ్డు శంకరయ్య, వర్కాల రవీందర్, కడారి వెంకటేష్, భాష మల్ల యాదయ్య, బొడ్డుపల్లి తిరుపతి, బెల్లం మల్లయ్య, వెల్దుర్తి బ్రహ్మచారి, కొండ అశోక్, కొండ మహేష్ , భిక్షం, చల్ల సైదులు, తదితరులు పాల్గొన్నారు.