Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గ్రామ సభ లోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలి
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
దళితబంధు విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, గ్రామ సభలోనే లబ్దిదారులను ఎంపిక చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎంండి. జహంగీర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆ పార్టీ పట్టణ, మండల కమి టీల సమావేశం ఏసి రెడ్డి భవనం లో సూదగాని సత్య రాజయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం నిజంగా దళితులకు దక్కాలంటే వెంటనే వాటి విధి విధానాలను ప్రకటించాలని కోరారు . ఎమ్మెల్యేలకు దళిత బంధు లబ్దిదారులను గుర్తించే బాధ్యతను ఇవ్వడం వల్ల అది కేవలం టీఆర్ఎస్ కార్యకర్తల బంధువుగా మారుతుందన్నారు. నిజమైన దళిత కుటుంబాలకు దళిత బందు ఫలాలు అందాలని పేర్కొన్నారు . ఏ ప్రాతిపదికన నియోజకవర్గంలో వంద కుటుంబాలను గుర్తిస్తారో, ఇప్పటివరకు చెప్పకపోవడం, ఉండవలసిన అర్హతలు ,గురించి వివరించాలన్నారు .పథకం అమలుపై ప్రజలలో అనే సందేహాలు ఉన్నాయని ప్రభుత్వం వాటిని నివత్తి చేయాలన్నారు. నిజమైన దళిత కుటుంబాలకు దక్కాలంటే ,లబ్ధిదారులను గుర్తించే పనిని జిల్లా కలెక్టర్ , ప్రభుత్వ అధికారుల చేతిలో జవాబుదారీతనం ఉండాలన్నారు .ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్దిదారులు గుర్తించాలన్నారు. ఆలేరు ప్రాంతంలో తాగు, సాగు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగా ఆలేరు ప్రాంతానికి సాగు, తాగునీరు అందించే గంధమల్ల రిజర్వాయర్ పనులను వెంటనే చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. ఈ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయే రైతులనుతో మాట్లాడి నష్టపరి హారం విషయంలో ఏకాభిప్రాయం వచ్చే విధంగా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. గంధమల్ల రిజర్వాయర్ ఆటంకాలు తొలగించేం దుకు స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ప్రభుత్వం వత్తిడి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించాల న్నారు.రానున్న రోజుల్లో ప్రాజెక్టు నిర్మాణం కోసం ,ప్రజా సమస్యల పరిష్కారంకోసం ప్రజలను ఏకం చేసి ఉద్యమిస్తామ న్నారు..ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ. ఎక్బాల్ , మండల కార్యదర్శి దుపటి వెంకటేష్ , డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆనగంటి వెంకటేశ్, నాయకులు వడ్డెమాన్ శ్రీనివాసులు, మొరిగాడి రమేష్ ,నల్లమాస తులసయ్య, బుగ్గ నవీన్ ,చెన్న రాజేష్ ,పిక్క గణేష్, ఎలుగల శివ ,కాసుల నరేష్ ,కేతావత్ లక్ష్మి ,బోడ భాగ్య తదితరులు పాల్గొన్నారు .