Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కరెంట్ షాక్‌తో రెండు చేతులు కోల్పోయిన కార్మికుడు..
అ రెండు కాళ్లకు తీవ్ర గాయాలు..
అ మంచానికే పరిమితమైన కార్మికుడు..
అ గ్రామ పంచాయతీ కార్మికుడి వ్యధ...
నవతెలంగాణ-మిర్యాలగూడ
భార్య.. ఇద్దరు ముద్దుల పిల్లలు, అమ్మమ్మతో కలిసి జీవిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుడికి విధి ఎక్కిరించింది....సాఫీగా సాగే ఆ కుటుంబంలో కరెంట్ షాక్ వీధిన పడేసింది. ప్రజలకు వెలుగులు నింపేందుకు పోయి చివరకు తన కుటుంబాన్ని అంధకారంలో మునిగిపోయింది. గ్రామంలో వీధి లైట్లు వేసేందుకు వెళ్లి కరెంట్ షాక్ తో రెండు చేతులు కోల్పోయి వికలాంగునిగా మారిపోయాడు. రెండు కాళ్ళు కూడా తీవ్ర గాయాలు కావడంతో మంచనికే పరిమితమై కదలలేని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. కష్టపడితేనే గానీ పూటగడవని ఆ కుటుంబంలో కన్నీటి గాథలు అలుముకున్నాయి. బుక్కెడు అన్నం మెతుకులు కడుపులో నింపుకునేందుకు భార్య పిల్లలు నానా కష్టాలుపడుతున్నారు. ఒకపక్క భర్తకు వైద్యం చేయించుకోవడంలో స్థోమతకు మించి అప్పులు చేసి మరోపక్క కుటుంబ పోషణ కోసం తిప్పలు పడుతున్నారు.
మిర్యాలగూడ మండలంలో నూతనంగా ఏర్పడిన కాలువపల్లి తండా గ్రామ పంచాయతీలో మల్టీప ర్పస్ కార్మికుడిగా ఇస్లావ త్ కిషన్ నాయక్ కార్మికు డిగా పనిచేస్తున్నాడు. గ్రామపంచాయతీలో మొక్కలకు నీరు పోయ డం మొదలుకొని అన్ని పనులు చేస్తూ ఉంటా డు. దీనికి గాను గ్రామపంచాయతీ నుండి నెలకు రూ.8500 వేతనం పొందుతున్నాడు. 2021 నవంబర్ 2న గ్రామంలో వీధి లైట్లు వేసేందుకు కరెంటు స్తంభం ఎక్కాడు. అనుకోకుండా విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్‌కు గురై కింద పడ్డాడు. అప్పటికే కిషన్‌నాయక్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చూపించగా మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ రెండు చేతులు భుజం వరకు తీసివేశారు. రెండు కాళ్ళు కూడా తీవ్ర కాలిన గాయాలు కావడంతో ప్రస్తుతం పట్టీలు వేసి చికిత్స అందిస్తున్నారు. శరీరం కడుపు భాగంలో చాతి నుండి కింది వరకు గాయాలయ్యాయి. కనీసం నిలబడలేని, కూర్చోలేని పరిస్థితిలో మంచానికే పరిమితమై కార్మికుడు కాలం వెళ్లదీస్తున్నాడు. గ్రామ ప్రజలకు చీకటి నుండి వెలుగులు ఇవ్వాలని వీధి దీపాలు వేస్తుండగా ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదం కారణంగా తన కుటుంబం చీకటి మయంగా మారింది. ఇంత పెద్ద సంఘటన జరిగిన గ్రామపంచాయతీ నుండి ఆ కుటుంబానికి చిల్లిగవ్వ కూడా అందలేదు. కనీసం విద్యుత్ శాఖ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు రాలేదు..విధినిర్వహణలో కుటుంబం చిన్నా భిన్నమైందని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఆదుకోండి సారూ...
బాధితుడు కిషన్యక్
విధినిర్వహణలో భాగంగా జరిగిన ప్రమాదంలో తన రెండు చేతులు పోయాయి రెండు కాళ్ళు కూడా తీవ్ర గాయాలయ్యాయి. శరీరమంతా కాలిపోయి ఉంది. కనీసం నిలబడలేని కూర్చో లేకుండా మంచానికే పరిమితమై మూడు నెలలుగా నరకయాతన అనుభవిస్తున్న. పైగా కుటుంబ పోషణ భారంగా మారింది. ఇప్పుటి వరకు గ్రామపంచాయతీ నుండి విద్యుత్ శాఖ నుండ,ి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదు. నా దీన గాథను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలి. గ్రామపంచాయతీ విద్యా శాఖ నుండి ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలి.
కిషన్‌నాయక్ కుటుంబాన్ని ఆదుకోవాలి
కుటుంబాన్ని పరామర్శించిన జూలకంటి
మిర్యాలగూడ మండలంలోని కాలువపల్లి తండా గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ కార్మికుడిగా పనిచేస్తున్న కిషన్‌నాయక్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కాల్వపల్లి గ్రామంలో కిషన్ నాయక్ తో పాటు అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న కార్మికుడు కుటుంబం వీధిన పడిన గ్రామ పంచాయతీ విద్యుత్ శాఖ ప్రభుత్వం ఆదుకోకపోవడం సరికాదన్నారు. రెండు చేతులు పోయి, రెండు కాళ్లు తీవ్రగాయాలు మంచానికే పరిమితమైన కిషన్‌నాయక్ ధీనగాథ వింటే బాధేస్తుందన్నారు. భార్య ,ఇద్దరు పిల్లలు ,అమ్మమ్మతో కలిసి ఇ జీవిస్తున్న కుటుంబాన్ని కరెంట్ షాక్ చీకట్లో నింపిందన్నారు. ఎన్నో కుటుంబాలకు ఎన్నో రకంగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కుటుంబం దీనగాథ చూసి స్పందించాలని కోరారు. ఆ కుటుంబానికి రూ.25 లక్షలు సొంత ఇల్లు కొంత ప్రభుత్వ భూమి అందించి ఆదుకోవాలన్నారు . అతని భార్య ఉద్యోగం ఇవ్వాలని పిల్లల చదువు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కోరారు .ఈ విషయం ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వం సహాయం అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట సీపీఐ(ఎం) జిల్లా నాయకులు వీరపల్లి వెంకటేశ్వర్లు, వినోద్, ఆయూబ్, పాతని శ్రీనివాస్, జంగిలి భద్రయ్య, చవ్వా బిక్షం, పర్వతం ఎల్లయ్య, దిరావత్ రవి నాయక్, వాంకుడోత్ బిక్షం, శిరీషాల యాదయ్య ఉన్నారు.