Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యూఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐ భూమి మాయం
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
తిప్పర్తి రెవెన్యూ కార్యాలయంలో అవినీతికి కేరాఫ్‌గా మారిందని ఆరోపణలు వినిపిస్తు న్నాయి. ఒకరు పట్టా ఇతరులకు చేస్తే .... మరోకరి భూమిని రికార్డుల నుంచి తొలగించడం ఎక్కడ చూడం. కానీ తిప్పర్తిలోనే అలాంటిది సాధ్యమైంది. అధికారుల నిర్లక్ష్యమా... కావాలని చేశారో తెలియడం లేదు. పైగా తనకు అన్యాయం జరిగిందని మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళితే తామేమి చేయలేం.. రికార్డులు కూడా లేవని చెప్పడం విడ్డూరంగా ఉంది. కార్యాలం యలో ఒకరిద్దరు కిందిస్థాయిలో పనిచేసే అధికారులు కాసులకు కక్కుర్తి పడి అందరి రికార్డులను తారుమారు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిపై ఫిర్యాదులు వచ్చిన రెవెన్యూ అధికారులు కనీసం ఇప్పటివరకు విచారణ చేసిన దాఖలాలు లేవు.
యాజమాని యూఎస్ఏలో ఇక్కడ భూమి మాయం
ఎక్కడైనా తన ఆస్థిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయాలంటే సంబందిత యాజమాని అందుబాటులో ఉండి, ఆయన సమక్షంలోనే రిజిస్ట్రేషన్ జరగాలి. కానీ తిప్పర్తి రెవెన్యూ కార్యాలయంలో ఒకరు రిజిస్ట్రేషన్ చేస్తారు. మరోకరి రికార్డుల నుంచి భూమి మాయం చేస్తారు. యూఎస్ఏలో ఉన్న ఒక ఎన్నారై భూమిని కొంతమంది రెవిన్యూ అధికారులు మామిడాల గ్రామానికి చెందిన పైరవి కారులు కలిసి సుమారు 17ఎకరాల భూమిని అక్రమంగా పట్టాచేసుకున్నారు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని ఇక్కడ లేని సమయంలో అవినీతి అధికారులు వేరే వాళ్లకు పట్టా చేశారు. అక్రమపట్టాలపై జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారికి కూడ ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది.
అక్రమ పట్టా భూమి వివరాలు ఇవే....
1. కుమ్మరి జ్యోతి భర్త నాగయ్య సర్వే నెంబర్ 901 ఆ/2
12721/2017 2-32 గుంటల భూమి తప్పుడు ఆమాండ్మెంట్స్ ద్వారా పట్టా పొందినారు.
2). కొత్తపల్లి సలోమి భర్త వెంకన్న సర్వే నెంబర్ 902.902 /3 డాక్యుమెంట్ నెంబర్ 12722/2017. 4-024 గుంటల భూమి తప్పుడు అమెండ్మెంట్ ద్వారా పట్టా పొందినారు.
3). కందిమల్ల వెంకట్ రెడ్డి తండ్రి రాజిరెడ్డి సర్వేనెంబర్ 864,865, లలో 1-01 గుంటల భూమిని సాదాబైనామా ద్వారా తప్పుడు పట్టా పొందినాడు ,
4). కందిమల్ల రాజి రెడ్డి తండ్రి మట్టారెడ్డి సర్వేనెంబర్ 866. 0.22 గుంటల భూమిని ఎలాంటి ఆధారం లేకుండా కబ్జా కలిగి ఉన్నాడు
5) షేక్ సోహెల్ తండ్రి ఉస్మాన్ షేక్ జానీ బాబా తండ్రి ఉస్మాన్ సర్వే నెంబర్ 860,861, 864, సర్వే నంబర్లలో గల 2-19 గుంటలు భూమి సాదాబైనామా ద్వారా అక్రమ కొట్ట పొందినారు.
6). గోపగోని రమాదేవి భర్త నరసయ్య సర్వే నంబర్ 884 లో గల 1- 6 గుంటల భూమిని అప్పుడు పట్టా ద్వారా పట్టా పొందినాడు
7). గోపగోని నరసయ్య భర్త వెంకయ్య సర్వే నెంబర్ 884 లో గల 0-31 తప్పుడు పట్టా ద్వారా పట్టా పొందినారు.
8). ముకురాల రామయ్య తండ్రి పెద్ద లింగయ్య సర్వే నెంబర్ 883 1-02 భూమిని ఎలాంటి ఆధారం లేకుండా తప్పుడు పట్టా పొందాడు
9). నరముల మల్లమ్మ భర్త లింగయ్య సర్వే నెంబర్ 880, 888 లో2-09 గుంటల భూమిని పట్టా పాస్ పుస్తకం ప్రసాద్ రెడ్డి పేరట ఉన్నాకడా అక్రమ కబ్జా కలిగి ఉన్నది.
10). కొత్తపల్లి నాగయ్య తండ్రి బిక్షమయ్య సర్వే నెంబర్ 102. 0-20 గుంటల భూమిని పట్టా పాస్ పుస్తకం ప్రసాద్ రెడ్డి పేరట ఉన్న కూడా వీళ్లు అక్రమ కబ్జా కలిగి ఉన్నారు.
11) దామ పర్వతాలు సర్వే నెంబర్ 875 0-34 గుంటల భూమిని ఇతను ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కబ్జా కలిగి ఉన్నాడని తెలిసింది.
అక్రమ పట్టాదారులపై చర్యలు తీసుకోవాలి.
గడ్డం ప్రసీత్ రెడ్డి , మామిడాల గ్రామనివాసి భూమి యాజమాని,యూఎస్ఏ ఎన్నారై
నాకు వారసత్వంగా వచ్చిన 17 ఎకరాల 34 గుంటల భూమిని నేను ఇక్కడ లేని సమయంలో కొంతమంది వ్యక్తులు అక్రమ పట్టా, అక్రమ కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి అక్రమాలకు పాల్పడిన అధికారులపై నా, అక్రమంగా రిజిస్ట్రేషన్ పొందిన వారిపై తీసుకోవాలని కోరుతున్నాను. ఇదే విషయంపై గతంలో మండల తహాశీల్దార్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు కూడ చేశాను.
అక్రమ రిజిస్ట్రేషన్లపై పూర్తివిచారణ జరిపిస్తాం
కృష్ణయ్య, తహసీల్దార్ తిప్పర్తి
అక్రమంగా రిజిస్ట్రేషన్లపై తనకు ఫిర్యాదు వచ్చింది. వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తాం. ఏమైన తప్పులు జరిగితే దానికి సంబందించిన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.