Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ
నవతెలంగాణ- భూదాన్‌పోచంపల్లి
పిల్లాయిపల్లి నుండి దేశ్ ముఖ్ వరకు వెంటనే రోడ్డు పనులను పూర్తి చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని, సంబంధిత కాంట్రాక్టర్స్ ను డిమాండ్ చేసినారు.సోమవారం మండల పరిధిలోని పిల్లాయిపల్లిలో ఆ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో పిల్లాయిపల్లి -దేశ్‌ముఖ్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు, ఈ ఆయన మాట్లాడుతూ రెండున్నరేండ్ల క్రితం పిల్లాయిపల్లి నుండి దేశ్‌ముఖ్ వరకు రోడ్డు మంజూరు చేసి రెండు బిట్లుగా ఇద్దరి కాంట్రాక్టర్లకు 7 కోట్ల 60 లక్షలకు ఇవ్వగా ఏ పనులు చేపట్టలేదన్నారు. ఏడాది క్రితం మళ్లీ అదనంగా నిధులు కావాలని మరో రూ.2 కోట్ల 10 లక్షలు అదనంగా మంజూరు చేసుకుని కొంత మట్టిపోసి, అప్పుడప్పుడు కొంత పని చేస్తూ కాంట్రాక్టర్లు చేతులు దులుపుతున్నా పరిస్థితి ఉందన్నారు.ఈ రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు, రైతులు, రెండు గ్రామాల ప్రజలు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాదాల గురవుతున్న పరిస్థితి ఉన్నదని నర్సింహ ఆవేదన వెలిబుచ్చారు. ఈ నెల చివరి లోపు రోడ్డు పనులు పూర్తి చేయకపోతే రెండు గ్రామాల ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు గూడూరు బుచ్చిరెడ్డి, కోట రామచంద్రారెడ్డి, మంచాల మధు,అందేల జ్యోతి, గ్రామ శాఖ కార్యదర్శి మార్త సత్యనారాయణ, శాఖ సభ్యులు, గ్రామ ప్రజలు పత్తి బిక్షపతి, అందెల శ్రీనివాస్, అందెల యాదగిరి, కాగు అంజయ్య, కాగు లలిత, బందెల బాలమని,నుచ్చు రాజయ్య, సుక్క రాజు, కాగు నరసింహ, పర్వతం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.