Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తుంగతుర్తి
పంచాయతీ కార్యదర్శులు తమ విధుల పట్ల నిబద్ధతతో పని చేసినప్పుడే ప్రత్యేక గుర్తింపు వస్తుందని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కషి చేయాలన్నారు. జిల్లాలో తుంగతుర్తి మండలం చాలా వెనుకబడి ఉందని అన్నారు. గ్రామాలలో చేపట్టిన పల్లె ప్రకతి వనం నర్సరీ డంపింగ్ యార్డ్ తదితర పనులను నిరంతరం పరిశీలించాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడి భారం అధికంగా ఉన్నందున ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దన్నారు. విధులలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దష్టికి తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీపీఓకు అందజేశారు. అంతకుముందు మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో చేపట్టిన పలు అభివద్ధి పనులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చందా వెంకన్నను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి, ఎం పి ఓ భీమ్ సింగ్ నాయక్, ఏపీవో వెంకన్న, మండల పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.