Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేరేడుచర్ల
మండలంలోని మేడారం గ్రామ ఉన్నత పాఠశాలకు రూ.పది వేల విలువ గల కంప్యూటర్ను దాతల సహకారంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కంది బండ శ్రీనివాసరావు మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శోభన్ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వాతి మధు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు సుంకరి క్రాంతి కుమార్, ఉపాధ్యక్షులు రాచకొండ శ్రీనివాసరావు, కర్రీ సూరిబాబు, క్లబ్ సెక్రటరీ ఎడవెల్లి సత్యనారాయణ రెడ్డి, ట్రెజరర్ చల్ల ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు