Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- అర్వపల్లి
మండలం పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో సూర్య క్షేత్రం అఖండ జ్యోతి స్వరూప శ్రీసూర్యనారాయణ స్వామి దేవస్థానంలో మంగళవారం రథసప్తమి సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ రూ.6 లక్షలతో ఏర్పాటు చేసిన శ్రీ సూర్యనారాయణ స్వామి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఆశ్రమ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, వైస్ ఎంపీపీ మారిపెద్ది భవాని, ఆలయ చైర్మెన్ జనార్దన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుండగాని సోమేశ్ గౌడ్ పీఏసీఎస్ చైర్మెన్ కుంట్ల సురేందర్‌రెడ్డి మారి పెద్దిశ్రీనివాస్గౌడ,్ గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.