Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ చెరుకు పంటపై లాభం ఎంతొస్తుంది..?
అ లక్ష్మాపురం గ్రామ రైతు కళ్లెం జనార్ధన్‌తో ఎమ్మెల్యే చిరుమర్తి మాటామంతి
నవతెలంగాణ- రామన్నపేట
మండలంలోని లక్ష్మాపురం గ్రామానికి చెందిన యువ రైతు కళ్లెం జనార్ధన్ సాగుచేసిన బొప్పాయి, చెరకు పంటలను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరిశీలించారు. పలు అభివద్ధి కార్యక్రమాలకు వెళ్తూ రోడ్డు పక్కన ఏపుగా పెరిగిన బొప్పాయి తోటను చూసి వాహనాన్ని ఆపి తోట లోకి వెళ్లి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు జనార్దన్‌తో ముచ్చటించటిస్తూ బొప్పాయి సాగు ఎట్లుంది, చెరుకు పంటపై లాభం ఎంతొస్తుందని ఆరా తీశారు. గతంలో ఏ పంట సాగు చేసావని, బొప్పాయి, చెరుకు పంటలపై ఎంత ఖర్చు వచ్చిందని అడిగి తెలుసుకున్నారు. 3 ఎకరాలలో బొప్పాయి, 7 ఎకరాలలో చెరుకు పంటను సాగుచేస్తున్నట్లు రైతు ఎమ్మెల్యేకు వివరించారు. బొప్పాయి పంట లాభసాటిగా ఉందని రైతు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్లుగా వరికి బదులు చెరుకు, బొప్పాయి పంటను సాగుచేస్తున్నాని రైతు తెలపడంతో ఎమ్మెల్యే చిరుమర్తి ఆనందం వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక ఎంపీపీ జ్యోతి బలరాం, జెడ్పీటీసీ పున్న లక్ష్మీ జగన్మోహన్, పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల బిక్షం రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మందడి ఉదరు రెడ్డి, సర్పంచులు ఎడ్ల మహేందర్ రెడ్డి, రేఖ యాదయ్య, గుత్తా నరసింహారెడ్డి, పోచ బోయిన మల్లేశం, పోతరాజు సాయి, ఆమె ర్, బొడ్డు అల్లయ్య, తదితరులు ఉన్నారు.