Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తిరుమలగిరి
పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం అర్హులైన వికలాంగులకు త్రిచక్ర (రిట్రోఫిట్టెడ్) మోటార్ బైక్ ,ల్యాప్ టాప్‌లను లబ్దిదారులకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరికిషోర్‌కుమార్ పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరూ లబ్దిపొందుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందరిలో ఆనందాన్ని నింపుతుందన్నారు. ఈ సారి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీిఆర్‌ఎస్ మండల ప్రెసిడెంట్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మార్కెట్ చైర్మెన్ మూల అశోక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజిని రాజశేఖర్,కమిషనర్ శ్రీనివాస్, ఎంపీపీ స్నేహలత, కందుకూరి లక్ష్మయ్య, బత్తుల శ్రీను, వివిధ సర్పంచులు కౌన్సిలర్లు, వార్డుసభ్యులు పాల్గొన్నారు.