Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
నియోజకవర్గ కేంద్రంలోని కళాశాలలకు ,పాఠశాలలకు వచ్చే విద్యార్థుల సమయానుగుణంగా ఆర్టీసీ బస్సులను నడపాలని కోరుతూ మంగళవారం మండల కేంద్రంలో ఎన్ఎస్యూఐ మండల, పట్టణ కమిటీల ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక బస్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు .ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు యాదగిరిగుట్ట డిపో మేనేజర్ దష్టికి పలుమార్లు సమస్యను తీసుకువెళ్లినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ,రాజాపేట , అమ్మనబోలు బస్సును కుర్రరాం , తూర్పుగూడెం , కొడవటూరు ,రఘూనాథ్పూర్ బస్సుల సమయాలను మార్పు చేయాలని కోరారు. ఎస్ఐ ఎండీఏ ఇద్రిస్ అలీ డీఎంతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వల్లెపు ఉప్పలయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కలకుంట్ల లోకేష్,వైస్ ప్రెసిడెంట్ బిసా కిరణ్, ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షులు సుంకరి విక్రమ్, పూర్ణచేందర్,బరిగే శ్రీను, పాల్గొన్నారు.