Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ స్ఫూర్తి ప్రధాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని మై ప్రెండ్స్ సోషల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అద్యక్షులు చల్లగురుగుల రఘు బాబు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల (60వవారం) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించిన సమయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కషి చేశాడని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తి ఫొటో ను కరెన్సీ నోట్లపై ముద్రించక పోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్, జిల్లా అద్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు,తంగెళ్ళపల్లి రవికుమార్, మహ్మద్ సలావుద్ధీన్, భానోతు భాస్కర్, రావుల రాజు, సోమ రవింధర్ రెడ్డి, బండారు శివ శంకర్, పేరబోయిన మల్లేశం, డి ఎస్ పి జిల్లా కన్వీనర్ నరేందర్ పాల్గొన్నారు.