Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నాయని డీివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఆ సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ,రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వాలు నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్ వేయడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ యువతకు మొండిచేయి చూపిందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,91,126 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న నిరుద్యోగ పోస్టులను భర్తీ చేయాలని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్,ఉపాధ్యక్షులు ఉప్పల్లపళ్లి బాలకష్ణ, పల్లె మధు కష్ణ ,కౌడి సురేష్,సహాయ కార్యదర్శులు నాగటి ఉపేందర్ ,చెన్న రాజేష్ ,ఎండి ఖయ్యుం,ఎదునూరి వెంకటేష్,జిల్లా కమిటీ సభ్యులు సామిడి నాగరాజు రెడ్డి, బోడ భాగ్య,పగడాల శివ, ధ్యానబోయిన యాదగిరి,దేప రాజు,కొనాపురం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.