Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ - భువనగిరి
వీఆర్ఏలకు పేస్కేల్, పీఆర్సీ జీవోలను వెంటనే విడుదల చేయాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 10న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం ఆర్డీఓ ఆఫీస్ పరిధిలో వివిధ మండలాల వీఆర్ఏల తో కలిసి కరపత్రం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సెప్టెంబర్ 9న శాసన సభలో నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రతిపాదిస్తూ వీఆర్ఓ లను రద్దు చేసి వీఆర్ఏలకు పేస్కేల్్ ఇస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో విఆర్ఎ లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బోళ్ల బాషయ్య వివిధ మండలాల అధ్యక్షులు కోమండ్ల స్వామి,పసుల రమేష్,గడ్డం శ్రీను,చింతల పెంటయ్య,ఎడ్ల వెంకన్న,ఉతా భాస్కర్, బోయిన నర్సింహ నాయకులు సాయి,బిక్షయ్య నాయకులు బింగి శ్రీనివాస్,మాధవరెడ్డి, అర్జున్,జానీ పాల్గొన్నారు.