Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి గుంట్లకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-బీబీనగర్
దేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శమని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఫేమస్ ఫంక్షన్హాల్లో ఆ పార్టీ మండల అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ విస్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక కేసీఆర్ సారథ్యంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. ప్రధాని నరేంద్రమోడి 20 ఏండ్లు పరిపాలన చేసిన గుజరాత్ రాష్ట్రంలో నేటికీ రైతులకు ఉచిత విద్యుత్తు లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా రైతుబంధు, రైతులకు ఉచిత కరెంట్, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌లాంటి పథకాలు లేవన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌తోపాటు ఉద్యమ నాయకులు అనేక అవమానాలు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. రాష్ట్రం సాధించిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను విభజించి అభివద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఈ నెల 12న జిల్లా కేంద్రంలో నూతన కలెక్టర్ కార్యాలయంతోపాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివద్ధి చెందిందన్నారు. బీబీనగర్ పట్టణంలో సుమారు ఏడున్నర కోట్ల రూపాయలతో అభివద్ధిపరిచినట్టు తెలిపారు. మండలవ్యాప్తంగా ఆయా గ్రామాల్లోని సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ అభివద్ధి పనులు సాధించుకున్నామని, ఇది కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. మండలకేంద్రంతోపాటు మండలవ్యాప్తంగా కేవలం 20శాతం మేరకే అభివద్ధి పనులు మిగిలి ఉన్నాయని, వాటిని త్వరలో పూర్తిచేస్తామని తెలిపారు. 12న జరిగే బహిరంగసభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, ఎంపీపీ ఎరుకలి సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతపింగల్రెడ్డి, పార్టీ మండల ప్రధానకార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, నాయకులు బొక్క జైపాల్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు నారగోని మహేశ్‌గౌడ్, స్థానిక సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.