Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాజ్యసభలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు కావస్తున్నప్పటికి తెలంగాణా రాష్ట్ర విభజన చట్టం -2014 లో పేర్కొన్న ఏ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవారం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాజ్యసభ జీరో అవర్ లో ప్రసంగిస్తూ... చట్టంలో పేర్కొన్న కష్ణా, గోదావరి నదీ జలాల వివాదం గానీ, గిరిజన యూనివర్సిటీ మంజూరు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు,న్యూఢిల్లీ లోని జన్పద్లో తెలంగాణా భవన్కు భూమి కేటాయింపు ఇంత వరకు కేటాయించలేదని విమర్శించారు. పునర్విభజన చట్టం ప్రకారం వెనుక బడిన జిల్లాల అభివద్ధికి రూ.900 కోట్లు రావాల్సి ఉన్నప్పటికీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు.