Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఆ పార్టీ మండల కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నాయకులు ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల ముఖ్య నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటూ కరోనా సమయంలో బాధితులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలలో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోట పెద్ద స్వామి, డీసీపీ ప్రధాన కార్యదర్శి నుచ్చు నాగయ్య యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరికొండ శివకుమార్ , చిక్కుల వెంకటేశం, బింగి బిక్షపతి, ఎడ్ల శీను, చుక్క స్వామి, ఏలాముల జంగయ్య యాదవ్, గడ్డమీది వీరస్వామి, బొల్లేపల్లి అశోక్, కనుకుంట్ల బాబురావు, శెట్టి యాదగిరి, కోట మహేందర్ , వెంకటేశం, పిట్టల వెంకటేశం, కొండల్, కార్తీక్, బాలస్వామి పాల్గొన్నారు.