Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు
నవతెలంగాణ-కోదాడరూరల్
కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పట్టణ, మున్సిపల్ కేంద్రాలకు వర్తింపజేసి పేదలను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ నాగేంద్రబాబుకి సంఘం ఆధ్వర్యంలో మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కరోనా వచ్చి పట్టణాల్లో నివసిస్తున్న పేదలకు పని లేక అర్ధాకలితో తమ జీవనాన్ని గడుపుతున్నారన్నారు. అలాంటి పేదలకు ప్రభుత్వం తక్షణం ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి రోజుకు 200 రూపాయల కూలి చెల్లించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు వెల్ది పద్మావతి, జిల్లా ఉపాధ్యక్షుడు సోమ పంగు జానయ్య, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మిట్ట గణుపుల ముత్యాలు, షేక్ జానీ, వీరబాబు, వెంకటేష్, శ్రీనివాసు, ఉపేందర్, నరసింహారావు, సైదులు పాల్గొన్నారు.