Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ-నల్లగొండ
మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన నిరంకుశ పాలనకు అద్దం పట్టేలా ఉన్నాయన్నారు. అందరికీ సమాన హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని లేకుండా చేసే కుట్ర జరుగుతోందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఏడేళ్లలో ప్రజల అవసరాల కోసం ఎప్పుడూ పని చేయలేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ ఒక్కరిని వదలడం లేదని, సామాజిక న్యాయంపై సీఎం కేసీఆర్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చెరుకు సుధాకర్ ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షకు మద్దతు తెలిపి మాట్లాడుతూ కేసీఆర్ రాజ్యాంగం మార్చాలి అనడం దేశానికే ప్రమాదకరం అన్నారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ెపై ఉందన్నారు. ప్రజలు రాజ్యాంగాన్ని ఓను చేసుకుంటే పాలకులు విమర్శిస్తున్నారని అన్నారు. రాజ్యాంగం నచ్చకపోతే దేశం విడిచి వెళ్ళిపోవాలని, అది కేసీఆర్ అయినా ఇంకా ఎవరైనా అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ బకరం శ్రీనివాస్ మాదిగ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపల్లి రవి, జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, టీడీపీ స్టేట్ ఎగ్జిక్యూట్ సెక్రటరీ ఎల్.వి. యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, మల్లేపాక వెంకన్న, రమణ భార్గవ్, లంకపల్లి నగేష్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి బిక్షం, కొండేటి మురళి, కందుల అంజయ్య, మేడి శంకర్, అడెపు నాగార్జున, మచ్చ ఏడుకొండలు, కొమిరె స్వామి, పెరిగే శ్రీనివాసులు, కొత్తపల్లి వెంకన్న, బోడ సునీల్, బొజ్జ దేవయ్య, కత్తుల సన్నీ, బొజ్జ చిన్న మడుపు శీను, వెంకటయ్య, సహదేవుడు, గోపాల్, రవి మరియు ప్రజా సంఘాలు, నాయకులు పాల్గొన్నారు.