Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పూర్ణహుతిని వెలిగించిన ఎమ్మెల్యే చిరుమర్తి
నవతెలంగాణ-నార్కట్ పల్లి
దక్షిణ తెలంగాణలోని శైవ క్షేత్రాల్లో ప్రధానమైన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మంగళవారం ప్రారంభమయ్యాయి. గణపతి పూజను శ్రీవేద పండితులు బ్రహ్మశ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్యం దీక్షఅవధానులు చేతుల మీదుగా నిర్వహించగా నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తిలింగయ్య పూర్ణాహుతిని వెలిగించి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. అంతకంటే ముందు ఆచారం ప్రకారం ఆలయ కార్యనిర్వాహణాధికారి మహేంద్ర కుమార్, పాలకమండలి చైర్మెన్ మేకల అరుణ రాజిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకూ ప్రభుత్వం పెద్దపీటవేస్తుందన్నారు. జాతరకు లక్షలాదిగా తరలివచ్చేభక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేక కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్డీవో జగదీశ్ రెడ్డి, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాలకృష్ణ, ఎంపీటీసీ మేకలరాజరెడ్డి, ఎంపీడీవో గుండగోని యాదగిరి గౌడ్, కొండూరుశంకర్, ఆలయ అధికారులు ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు నరసింహారెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీటీసీలు చిరుమర్తి యాదయ్య, పాలకమండలి ధర్మకర్తలు రాధా రపు బిక్షపతి, పసునూరి శ్రీనివాస్, కల్లూరు శ్రీను, బొబ్బిలి దేవేందర్, ప్రభాకర్ రెడ్డి, టీిఆర్ఎస్ నాయకులు దోసపాటి విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.