Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-జనగామ
సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన ప్రారం భోత్సవం ఏర్పాట్లు ఘనంగా చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. మంగళవారం జన గామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మంత్రులు సందర్శించి పరి శీలించారు. పూజగది, సమావేశ మందిరం, భోజ నాల ఏర్పాట్లు చేసే గదులను, మీటింగ్ హాల్లో జిల్లా వైభవాన్ని తలపింపజేసే ఫొటోలు, అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల ఫొటోలను పరిశీలిం చారు. కలెక్టర్ కార్యాలయాన్ని అద్దంలా మెరిసేలా, పచ్చదనం ఉట్టిపడేలా పూలమొక్కలు ఏర్పాటు చేయించాలని మంత్రులు సూచించారు. ఈ నెల 11న ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు. భవన నిర్మాణ ముఖద్వారం ప్రధాన రహదారి వైపు ఉండడంతో రంగులు వేసి అందంగా తీర్చిది ద్దాలన్నారు. వారివెంట అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, భాస్కర్, జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీిఆర్డీఏ పీడీ రామ్‌రెడ్డి, సీపీఓ ఇస్మాయిల్, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ ఆర్డీఓలు మధు మోహన్, కృష్ణవేణి, డీపీఓ రంగాచారి, విద్యాశాఖధికారి రాము, డీసీహెచ్ఎస్ సుగుణాకర్ రాజు, పశుసంవర్ధక శాఖ అధికారి నర్సయ్య, బీసీ కార్పొరేషన్ ఈడీ రవీందర్, పౌరసరఫరాల అధికారి రోజా రాణి, తాసిల్ధార్ రవీందర్, 3వ వార్డు కౌన్సిలర్ పగిడిపాటి సుధ, తదితరులు పాల్గొన్నారు.