Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్
నవతెలంగాణ-పాలకుర్తి
ఈనెల 11న జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం తోపాటు, టీిఆర్‌ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభానికి వస్తున్న సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభ జన జాతరగా మారాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ టీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మంగళవారం మండలంలోని బొమ్మెర లో మెట్టు శ్రీనివాస్ దర్దేపల్లి లో, పెద్దతండ (కె లో టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మంచుప్పులలో ఎంపీపీ నాగిరెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ జరుపుల బాలునాయక్, చెన్నూరులో జడ్పీ ఫ్లోర్ లీడర్ పూస్కూరి శ్రీనివాసరావు వేర్వేరుగా సమా వేశాలను ఏర్పాటు చేశారు. బొమ్మెర లో జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండీి మదర్‌తో కలిసి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసే బహిరంగ సభతో జనగామ ఉద్యమస్ఫూర్తిని చాటాలని పిలుపు నిచ్చారు. బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. పాలకుర్తి మండలం నుండి అధిక సంఖ్యలో జనాన్ని తరలించేందుకు టీఆర్ ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య. మండల సంయుక్త కార్యదర్శి దొంతమల్ల గణేష్, టీిఆర్‌ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడు నోముల సతీష్, సర్పంచులు ఇమ్మడి ప్రకాష్,పూస్కూరి పార్వతి రాజేశ్వరరావు, లావుడియా శాంతమ్మ, బొమ్మగాని కొమురయ్య, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లావుడియా దేవా నాయక్, ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఆకారపు ఉపేందర్, ఎంపీటీసీ కళింగరావు, తదితరులు పాల్గొన్నారు.