Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
మునగాల జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి టి. అఖిల్ రూపొందించిన ప్రాజెక్టు జాతీయ సైన్స్ ప్రదర్శనకు ఎంపికైంది. అఖిల్ తయారు చేసిన కొబ్బరి బొండం నుంచి కొబ్బరి నీరు తీసే యంత్రం జాతీయ స్థాయికి ఎంపిక కావటం పట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డి. సీ తారామరాజు హర్షం వ్యక్తం చేశారు. గ త నెలలో రాష్ట్ర స్థాయిలో ఎంపికై ఈనెల 10 న విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయి ప్రదర్శన కు ఎంపికైందని చెప్పారు. జిల్లా లో ఒక్క మునగాల హైస్కూల్ మాత్రమే ఎంపికైందని పేర్కొ న్నారు. ఉపాధ్యాయులు షేక్ జాఫర్ సూ చనలతో అఖిల్ తయారు చేసిన ఈ యంత్రం జాతీయ స్థాయికి ఎంపిక కావటం గర్వంగా ఉందన్నారు. బాల శాస్త్ర వేత్త అఖిల్ ను హైస్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ తోకల సైదులు, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.