Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చివ్వెంల :సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15 రోజున సెలవు దినంగా ప్రకటించాలని లంబాడీ విద్యార్థి సేన రాష్ట్ర అధికార ప్రతినిధి విజరునాయక్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో లంబాడీ విద్యార్థి సేన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి తండా,గ్రామ పంచాయతీలో సేవాలాల్ మహారాజ్, మేరమ్మయాడి గుడి నిర్మించాలని కోరారు. ప్రతి తండాలో ఆయన ఫొటోను పెట్టి పూజించాలని కోరారు.ప్రతి తండా వాసులకు సేవలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాలు,చేసిన సేవలను గురించి వివరించాలని కోరారు.సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున ఒక్కో జిల్లాకు రూ.కోటి కేటాయించాలి. డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో లంబాడీ విద్యార్థి సేన హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు గోపీనాయక్, సేవాలాల్ బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు గోపి రాథోడ్, సేవాలాల్ సేన రాష్ట్ర సాంస్కృతిక ప్రధాన కార్యదర్శి కోటేశ్నాయక్,నాగరాజునాయక్, నాగేశ్వర్,తులసిరామ్, రమేశ్, కృష్ణ పాల్గొన్నారు.