Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
దళితబంధును వినియోగించుకొని అభివృద్ధి చెందాలని జెడ్పీటీసీ భూక్యా సంజీవ్‌నాయక్, వైస్‌ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి అన్నారు.గురువారం తుల్జారావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దొంగరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో దళిత బంధు ఎంపిక కోసం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో తుల్జా రావు పేట గ్రామాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎంపిక చేశా రన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించిన లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, సర్వేకు ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీ, ఎంపీఓ గోపి,వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.