Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రంలోని గ్రామీణ కృషి అనుభవం పొందుతున్న లయోల కళాశాలకు చెందిన బి ఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ విద్యార్థులకు గురువారం నూతన సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించినట్లు కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి. లవకుమార్ తెలియజేశారు. ప్రస్తుత వ్యవసాయ అనుబంధ రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ వినియోగం, సాంకేతిక విజ్ఞానము వాడకం తప్పనిసరి అయ్యిందని, వీటి వినియోగంపై వ్యవసాయ విద్యార్థులకు సరైన అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కొత్త టెక్నాలజీ లైన డ్రోన్స్ వినియోగం, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, సెన్సర్స్ వినియోగం, అగ్రికల్చర్ మొబైల్ అప్స్, ఇంటర్ నెట్ వినియోగం, ట్విట్టర్, పేస్ బుక్, ఎక్స్పర్ట్ సిస్టమ్, రిమోట్ సెన్సిసింగ్, జీపీఆర్ ఎస్ మొదలగు మాధ్యమాల ద్వారా సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ అనుబంధ రంగాల్లో అభివృద్ధిని సాధించవచ్చునని విద్యార్థులకు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా అవగాహన కలిపించారు. తదుపరి పట్టు పురుగుల పెంపకం గురించి డా.టి.మాధురి వివరించి క్షే త్రాన్ని సందర్శించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రావే ఇంచార్జి ఏ.నరేష్ తో పాటు లయోలా కళాశాలకు చెందిన పి.నిఖిల రెడ్డి, సాహితి, సంజన, సంధ్య, దీప్తి, మనీషా, సుమంత్ , రంజిత్ అభరు 54 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.