Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కమిటీ ని గురువారం స్థానిక పీఆర్టీయూ భవనంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొమ్మెర బోయిన కేశవులు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా బండమీది అంజయ్య, ప్రధాన కార్యదర్శి కత్తి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడిగా వనమా క్రిషన్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా జోగు వెంకన్నలను సభ్యులచే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా విశ్రాంతి ఐఏఎస్ ఆఫీసర్ చొల్లేటి ప్రభాకర్, జలసాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణ వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన కమిటీ సభ్యులు రెండు సంవత్సరాల ఉంటారన్నారు. ప్రజల పక్షాన సమాచార హక్కు చట్టాన్ని బలోపేతం చేస్తూ గ్రామస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు చేరువుగా ఉంటూ వారి సమస్యలకు సరైన విధంగా స్పందిస్తామన్నారు. వారికి చట్టాన్ని వాటి ఉపయోగాన్ని తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చూపూరి సతీష్, గౌరవ అధ్యక్షుడు కోరబోయిన ఆంజయ్య,జీనుగు జ్యోతి రెడ్డి, డబ్బా కొండమ్మ, సదా లక్ష్మీ, ధనలక్ష్మి, జిల్లా అసోసియేట బచ్చగొని దేవేందర్, గణేష్, కోటేష్, సందీప్, సంతోష్, యాదగిరి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.