Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పట్టణ,మున్సిపల్ కేంద్రాలకు వర్తింపజేసి పేదలను ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు డిమాండ్ చేశారు.గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యా లయం ముందు గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పట్టణ పేదలకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేండ్లుగా కరోనా వచ్చి పట్టణాల్లో నివసిస్తున్న అటువంటి పేదలకు పనిలేక అర్ధాకలితో తమ జీవనాన్ని గడుపుతున్నారని విమర్శించారు. అటువంటి పేదలకు ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని వర్తింపజేసి రోజుకు రూ.200 చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ బడ్జెట్లను తగ్గిస్తుందన్నారు.2020-21లో రూ.లక్షా 10 వేల కోట్లు 21 -22లో రూ.98 వేల కోట్లు రూ.2022- 23 ప్రస్తుత బడ్జెట్లో లో కేవలం రూ.73 వేల కోట్లు కేటాయించి ఈ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు.దేశ వ్యాప్తంగా వామపక్షాలు,వ్యవసాయకార్మిక సంఘాల పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీచట్టాన్ని తెచ్చిపేదలకు చట్టాన్ని తెచ్చి పేదలకు ఉపయోగపడే విధంగా చర్యలు చేపడితే నేడు మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు.రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ మున్సిపల్ పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయాలని లేఖ వ్రాయటం జరిగిందని, ఆ లేఖకే పరిమితం కాకుండా మున్సిపల్ ప్రాంతాలకు చట్టం వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఇప్పటికీ ఈ పథకంలో అవినీతి జరిగిందనే పేరుతో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు క్రమక్రమంగా బలహీన పరుస్తున్నాయని విమర్శించారు.పేదలకు వరం లాంటి పథకాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయకుండా పేదలందరికీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం మున్సిపల్,పట్టణ ప్రాంతాలకు ఉపాధి చట్టాన్ని వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని డీఈ సత్యప్రకాష్కు అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎల్గూరి గోవింద్ ,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం,డీివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జిల్లేపల్లి నర్సింహారావు, జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయినరవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు పోషణబోయిన హుస్సేన్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, సీఐటీయూ పట్టణ నాయకులు మామిడి సుందరయ్య ,వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాముల సీతారాములు పాల్గొన్నారు.