Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
చేనేత వస్త్రాల తయారీలో అనుబంధంగా పని చేసే కార్మికులకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గుండు వెంకటనర్సు కోరారు.గురువారం మోత్కూరులో చేనేతకు అనుబంధంగా పని చేస్తున్న కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాల తయారీలో మగ్గం నేసేవారితో పాటు రంగులఅద్దకం, అచ్చు అతకడం, కండెలు చుట్టడం, అడ్డాపోయడం లాంటి ఐదు రకాల కార్మికులు పనిచేస్తేనే నాణ్యమైన వస్త్రాలు తయారవుతాయన్నారు.ప్రభుత్వం ప్రకటించిన చేనేతకు చేయూత (త్రిఫ్ట్) పథకంలో అనుబంధ కార్మికులు ముగ్గురికి అవకాశం కల్పిస్తామని చెప్పి ఇద్దరికి మాత్రమే అమలు చేస్తున్నారని, దీంతో మిగతా కార్మికులు నష్టపోతున్నారని తెలిపారు.జిల్లాలో అడ్డా పోసే (నిలువు దారం పోసేవారు) సుమారు వంద కుటుంబాలు ఉంటాయని, వారంతా వత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారని, వారికి గుర్తింపు నంబర్లు లేకపోవడంతో పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారికి జియోట్యాగ్ ద్వారా నంబర్లు ఇచ్చి పథకాలు వర్తింపజేయాలని, హౌజ్ కంవర్క్ షెడ్లు నిర్మించి ఇవ్వాలని, చేనేత బంధు అమలు చేసి ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.30 వేలు ఆర్థిక సాయం చేయాలని, చేనేత బీమా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు వనం ఉపేందర్, బొల్లు యాదగిరి, మద్దెపురం రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి బుర్రు అనిల్‌కుమార్ పాల్గొన్నారు.