Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీసీ విద్యుత్ ఉద్యోగులు ఏకం కావాలి
అ విద్యుత్ ఉద్యోగుల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి మురళి
నవతెలంగాణ-రామన్నపేట
బీసీ విద్యుత్ ఉద్యోగులు ఏకం కావాలని, విద్యుత్ ఉద్యోగుల సమైక్యతోనే హక్కులను సాధించుకోవచ్చని,సమస్యలను పరిష్కరించు కోవచ్చని విద్యుత్ ఉద్యోగుల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బొబ్బిలి మురళి, కార్యదర్శి పొట్టబత్తుల శ్రీనివాస్ అన్నారు.మండల కేంద్రంలో గురువారం బీసీ విద్యుత్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐక్యఉద్యమాలతోనే తమ సమస్య లను పరిష్కరించుకోవాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని, ప్రమోషన్లు,రిజర్వేషన్ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.బీసీ ఉద్యోగుల ఏమైనా సమస్యలు ఉంటే తమ దష్టికి తీసుకురావాలని సాధ్యమైనంతవరకు వాటిని పరిష్కరించేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో బీసీ సంఘం నాయ కులు ధరణికోట నరేష్, సిద్ది లింగం, బాలనర్సింహ, జిల్లపల్లి వెంకటేశ్వర్లు, కునూరు శ్రీనివాస్, అధికారులు వెంకర్ల మచెందర్, జోగుల నర్సింహ, బాలగోని మత్స్యగిరి, ఉద్యోగులు వేణు, మల్లయ్య , సురేష్, నర్సింహ, కష్ణా, శ్రీకాంత్, చాంద్,అస్లాం,శరత్,యాదగిరి పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
రామన్నపేట సబ్ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షులుగా చిలకమర్రి నారాయణచారి, రామన్నపేట సెక్షన్లీడర్గా రవీందర్, వలిగొండ సెక్షన్ లీడర్‌గా మసంపల్లి పరుశరాములును ఏగ్రీవంగా ఎన్నుకున్నారు.