Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరిటౌన్
జిల్లాకేంద్రంలోని స్టాన్ఫోర్డ్ డిగ్రీ కాలేజీలో ఎస్ఎఫ్ఐ భువనగిరి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహాసభల కరపత్రం విడుదల చేశారు.ఈసందర్భంగా స్టాన్ఫోర్డు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కర్తల శ్రీనివాస్,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వనం రాజు మాట్లాడుతూ ఈ నెల 21,22వ తేదీల్లో చౌటుప్పల్ పట్టణంలో జయశ్రీ గార్డెన్లో ఎస్ఎఫ్ఐ మూడో జిల్లా మహసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. మహాసభలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి బలంగా విద్యార్థి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి చింతల శివ, మండల అధ్యక్షులు పల్లెర్ల సందీప్,పట్టణ ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్,ఎస్ఎఫ్ఐ నాయకులు ఎండి రెహాన్, ఈర్ల కార్తీక్, నెల్లికొండ శివ,నాగేందర్, సాయినాథ్ పాల్గొన్నారు.