Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
కర్నాటక రాష్ట్రంలో హిజాబ్ ధరించిన ముస్లిం మైనారిటీ విద్యార్థినులపై కాసాయీమూకలు చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు.గురువారం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నాటకలో ముస్లిం మైనారిటీ విద్యార్థినులపై జరిగిన దాడులకు నిరసనగా జిల్లా కేంద్రంలోని వాణిజ్యభవన్సెంటర్లో ప్లకార్డులతో నిరసన తెలపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం, మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల పేరుతో పాలన కొనసాగిస్తూ దేశంలో మత వైషమ్యాలను సృష్టిస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు,కోటగోపి, మట్టిపల్లి సైదులు, ఎల్గూరి గోవింద్, జె.నర్సింహారావు, చినపంగినర్సయ్య, పులుసు సత్యం, వీరబోయిన రవి, ముస్లిం మైనార్టీ నాయకులు ఆశ్రర్,కిరాణా మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మిడి లక్ష్మీనారాయణ, ఆవాజ్ జిల్లా కార్యదర్శి షేక్జహంగీర్, టూ టౌన్ కార్యదర్శి బత్తుల వెంకన్న,పీఎన్ఎం జిల్లా అధ్యక్షుడు బచ్చలకూరి రాంబాబు, నాయకులు పోషణబోయిన హుస్సేన్,మామిడి సుందరయ్య,బెల్లంకొండ వెంకటేశ్వర్లు, పాముల సీతారాములు,చిత్రం భద్రమ్మ, మైనార్టీలు పాల్గొన్నారు.