Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నల్లగొండ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో గల పార్క్‌లను సందర్శకులకు ఆహ్లాద పరిచే విధంగా మరింత సుందరంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణా చారి, మున్సిపల్ ఇంజనీర్లతో కలిసి పట్టణంలోని రాంనగర్ పార్క్, ఎస్.ఎల్బీసీ వద్ద, మెడికల్ కళాశాల ఏర్పాటు స్థలంలో పార్క్‌లను, రాజీవ్ పార్క్ లను సందర్శించి పలు సూచనలు చేశారు. రాంనగర్ పార్క్‌లో బోటింగ్, మ్యూజికల్ ఫౌంటెన్ రిపేర్ లు పూర్తి చేయాలని, పార్క్ ముందు లే అవుట్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, సందర్శకులకు పార్క్‌లో సూచిక బోర్డ్‌లు ఏర్పాటు చేసి అభివృద్ధి పరచాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ, మెడికల్ కళాశాలకు కేటాయించిన స్థలంలో 7 ఎకరాలలో ప్లాంటేషన్, పక్కన ఎస్ఎల్బీసీ వద్ద 9 ఎకరాల లో ప్లాంటేషన్ పరిశీలించి గ్రీనరీ పెంపొందించేలా సుందరంగా తయారు చేయాలని అన్నారు. రాజీవ్ పార్క్ వద్ద ప్రవేశం వద్ద పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. చర్లపల్లి వద్ద 14 ఎకరాలలో దేవాదాయ, ఎఫ్టీఎల్ వద్ద ఏర్పాటు చేయనున్న అర్బన్ లంగ్ స్పేస్ పార్క్ ఏర్పాటు ప్లాన్ పరిశీలించి ప్రతి పాదనలు త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ ఈ ఈ శ్రీనివాస్, డీఈలు అశోక్, వెంకన్న, ఏఈలు ఉన్నారు.