Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్కట్పల్లి : మండల పరిధిలోని చెర్వుగట్టులో గల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం ఎమ్మెల్సీ, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆచారం ప్రకారం వారికి కి పాలకమండలి చైర్మన్ మేకల అరుణ రాజిరెడ్డి, కార్యనిర్వహణాధికారి కె.మహేంద్ర కుమార్, ప్రధాన అర్చకులు పోతుల పాటి రామలింగేశ్వర శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో లో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాలకృష్ణ ,ఎంపీటీసీ మేకల రాజి రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బైరెడ్డి కర్ణాకర్ రెడ్డి, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరు శంకర్, ఆలయ అధికారులు ఇంద్రసేనా రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీనివాసరెడ్డి శంకర్, వంశీ పాలకమండలి ధర్మకర్తలు పాల్గొన్నారు.